IPL 2026: చెన్నై చిత్తు..ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ
ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ
IPL 2026: సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విశ్వరూపం ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌ను 43 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఆర్సీబీ గ్రాండ్ విక్టరీని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి.. దేవదత్ పడిక్కల్ 50 పరుగులతో అదిరిపోయే ఫౌండేషన్ వేశాడు. ఆ తర్వాత మొదలైంది అసలైన విధ్వంసం! టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లోనే 8 సిక్సర్లతో విరుచుకుపడి 70 పరుగులు సాధిస్తే.. కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 19 బంతుల్లో 48 రన్స్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.
251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కేకు ఆదిలోనే చుక్కలు కనిపించాయి. సర్ఫరాజ్ ఖాన్ 50 పరుగులు, ప్రశాంత్ వీర్ 43 రన్స్‌తో పోరాడినా.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి వారు తలవంచక తప్పలేదు. భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లతో చెలరేగగా.. డఫీ, క్రునాల్ పాండ్యా, అభినందన్ తలో రెండు వికెట్లు తీసి సీఎస్కేను 207 పరుగులకే ఆలౌట్ చేశారు.
వరుసగా మూడో ఓటమితో సీఎస్కే డీలా పడగా.. చిన్నస్వామి స్టేడియం మొత్తం 'ఆర్సీబీ.. ఆర్సీబీ..' నినాదాలతో హోరెత్తిపోయింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టిమ్ డేవిడ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ విజయంతో బెంగళూరు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది!