IPL 2026 Season: ఐపీఎల్ 19 సీజన్ రికార్డ్..110 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతున్న లీగ్

110 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతున్న లీగ్

Update: 2026-05-16 03:42 GMT

IPL 2026 Season: ఇండియన్ ప్రిమియర్‌ లీగ్‌.. క్రికెట్ మజా అంటే ఏంటో మరోసారి నిరూపిస్తోంది! 19వ ఎడిషన్‌లో ఐపీఎల్ సృష్టిస్తున్న ప్రభంజనానికి అడ్డులేకుండా పోతోంది. మొన్నటివరకు దేశంలో ఎన్నికల హడావుడి ఉన్నా సరే.. వాటన్నింటినీ తట్టుకొని మరీ ఈ సీజన్ అద్భుతమైన గణాంకాలను నమోదు చేస్తోంది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్‌షిప్‌తో ఈ సీజన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అటు టీవీ, ఇటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్.. రెండింటిలోనూ రికార్డు స్థాయి పెరుగుదల కనిపిస్తోంది. జియో హాట్‌స్టార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు ప్లాట్‌ఫామ్‌లలో కలిపి ఏకంగా 1.1 బిలియన్ వ్యూస్ రావడం విశేషం.

ముఖ్యంగా టీవీ వ్యూయర్‌షిప్ 50 కోట్ల మార్క్‌ను తాకగా.. డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధి నమోదైంది. మ్యాచ్‌లను వీక్షించే సమయం 7 శాతం పెరగడమే కాకుండా, ప్రాంతీయ భాషల్లో వీక్షించే వారి సంఖ్య ఏకంగా 42 శాతం పెరగడం ఈ సీజన్ ప్రత్యేకత.

ఈ విజయంపై జియోస్టార్ సేల్స్ హెడ్ అనుప్ గోవిందన్ స్పందిస్తూ.. అభిమానుల ఆదరణకు ఇదొక తార్కాణమని, ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న వేళ వ్యూయర్‌షిప్ మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 58 మ్యాచ్‌లు ముగిశాయి. లీగ్ స్టేజ్‌లో మరో 12 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతుండటంతో.. రానున్న రోజుల్లో ఈ రికార్డులు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి!

Tags:    

Similar News