IPL 2026: ఈసారి కప్ ఆ జట్టుదే .. అక్షర్ పటేల్ సంచలన ప్రెడిక్షన్.!
అక్షర్ పటేల్ సంచలన ప్రెడిక్షన్.!
IPL 2026: ఐపీఎల్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్.. ఈ నాలుగు జట్లూ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లాయి. టైటిల్ కోసం ఇప్పుడు హోరాహోరీ పోరు నడుస్తోంది.
ఈ తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన అక్షర్.. ఈసారి కప్ గెలిచేది ఎవరో ముందే ప్రెడిక్ట్ చేసేశాడు!
"సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రస్తుతం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. వాళ్ల టాప్-3 బ్యాటర్లు గనుక ఫామ్‌లో ఉంటే.. ఆ టీమ్‌ను ఆపడం ఎవరి తరం కాదు. అందుకే ఈసారి ఐపీఎల్ టైటిల్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే!" అంటూ అక్షర్ పటేల్ జోస్యం చెప్పాడు.
నిజానికి ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ గ్రాఫ్ మామూలుగా లేదు. 14 మ్యాచ్‌లలో 9 విజయాలు, 5 అపజయాలతో 18 పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేట్ లీడ్ వల్ల పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, గుజరాత్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్‌కు మెయిన్ పిల్లర్స్ ఎవరంటే.. వాళ్ల టాప్ బ్యాటర్లే! అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్.. ఈ ముగ్గురూ ఈ సీజన్‌లో ఆల్రెడీ 500 ప్లస్ రన్స్ కొట్టి ఊపుమీదున్నారు. ఆర్సీబీతో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో ఈ ముగ్గురూ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ జట్టు ఆశలన్నీ వీరిపైనే ఉన్నాయి.
ఇక వీరితో పాటు డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా సన్‌రైజర్స్ సొంతం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు హెడ్ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఒక్కసారి అతడు రిథమ్‌లోకి వస్తే పవర్‌ప్లేలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. దీనికి తోడు కెప్టెన్ పాట్ కమిన్స్ మైండ్ గేమ్, లీడర్‌షిప్ సన్‌రైజర్స్‌కు కొండంత బలాన్ని ఇస్తోంది.