IPL 2026: ముంబై కమ్ బ్యాక్ ఇస్తుందా? గుజరాత్ హ్యాట్రిక్ కొడుతుందా?

గుజరాత్ హ్యాట్రిక్ కొడుతుందా?

Update: 2026-04-20 04:42 GMT

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో అసలైన మజా మొదలైంది! ఒకవైపు పరాజయాల సుడిగుండంలో కూరుకుపోయిన ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్. నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ పోరులో గెలుపెవరిది? ముంబై మళ్ళీ గెలుపు రుచి చూస్తుందా? లేక గుజరాత్ తన హ్యాట్రిక్ జోరును కొనసాగిస్తుందా?

ముంబై ఇండియన్స్ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి శుభారంభం చేసినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. బ్యాటింగ్ వైఫల్యం, బౌలింగ్‌లో పస లేకపోవడం ముంబైని వెంటాడుతున్నాయి. రోహిత్ శర్మ సేన, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ మ్యాచ్‌తోనైనా మళ్లీ గెలుపుబాట పట్టి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ముంబై ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. వారు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానం వైపు అడుగులు వేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సమతూకంతో కనిపిస్తోంది గుజరాత్ జట్టు. ముఖ్యంగా వారి సొంత మైదానంలో ఆడుతుండటం వారికి కలిసొచ్చే అంశం. ముంబైని సొంత గడ్డపై దెబ్బకొట్టి తమ విన్నింగ్ స్ట్రీక్‌ను నాలుగో మ్యాచ్‌కు పెంచుకోవాలని జిటి పట్టుదలతో ఉంది.

గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ ఐదు సార్లు పైచేయి సాధించగా, ముంబై ఇండియన్స్ కేవలం మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది. హెడ్-టు-హెడ్ రికార్డుల్లో గుజరాత్‌దే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది.

Tags:    

Similar News