IPL Mini Auction to Be Held in Abu Dhabi: అబుదాబీలో ఐపీఎల్ మినీ వేలం.!

ఐపీఎల్ మినీ వేలం.!

Update: 2025-11-12 03:29 GMT

IPL Mini Auction to Be Held in Abu Dhabi: ఐపీఎల్ (IPL) 2026 మినీ -వేలంను అబుదాబి (Abu Dhabi) లో నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రణాళికలు సిద్ధం చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం .ఇది విదేశీ గడ్డపై వరుసగా మూడోసారి ఐపీఎల్ వేలం జరగనుంది.అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ డిసెంబర్ 15 లేదా 16న వేలం జరగవచ్చని తెలుస్తోంది.

గత రెండు వేలంపాటలు (2023లో దుబాయ్, 2024లో జెడ్డా) విదేశాల్లోనే జరిగాయి, ఆ ట్రెండ్‌ను కొనసాగించాలని BCCI నిర్ణయించింది.అబుదాబిలో అంతర్జాతీయ సిబ్బంది, ప్రసారకర్తలకు (Broadcasters) సౌలభ్యం ఎక్కువగా ఉండటం ప్రధాన కారణం.భారతదేశంలో డిసెంబర్‌లో పెళ్లిళ్ల సీజన్ కావడంతో వేదికల లభ్యత కొరత కూడా ఒక కారణంగా తెలుస్తోంది.అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకోదలిచిన ఆటగాళ్ల తుది జాబితాను నవంబర్ 15లోగా బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది.

రాజస్థాన్ ను వీడి సంజూ శాంసన్ చెన్నైలో చేరడం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరో వైపు శామ్ కరణ్, జడేజా చెన్నైను వీడనున్నట్లు తెలుస్తోంది.మరో మూడు రోజుల్లో ఏ జట్టు ఎవరిని వదిలేస్తుందో చూడాలి.

Tags:    

Similar News