Supreme Court Questions Shami’s Wife: నెలకు 4 లక్షలు సరిపోవా.?..షమీ భార్యకు సుప్రీం ప్రశ్న

షమీ భార్యకు సుప్రీం ప్రశ్న

Update: 2025-11-07 13:02 GMT

Supreme Court Questions Shami’s Wife: భారత క్రికెటర్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోల్ కతా హైకోర్టు గతంలో ఆదేశించిన ఈ రూ.4 లక్షల మొత్తాన్ని నెలకు రూ.10 లక్షలకు పెంచాలని (తన కోసంరూ. 7 లక్షలు, కుమార్తె కోసం రూ.3 లక్షలు) కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు.

షమీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని అమౌంట్‌ను పెంచాలని కోరారు. దీంతో షమీ, బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ‘ఇప్పటికే ఇస్తున్న రూ.4లక్షలు పెద్ద అమౌంటే కదా’ అని జహాన్‌ను ప్రశ్నించింది. విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.

షమీ, హసీన్ జహాన్ కు 2014లో వివాహం అయితే, 2018లో విడిపోయారు. తన భర్త షమీ తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని హసీన్ 2018లో షమీపై కోల్ కతాలోని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు వరకట్నం వేధింపులు, గృహ హింస చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కోల్ కతా హైకోర్టు ఆదేశం ప్రకారం షమీ ప్రస్తుతం ఆమెకు నెలకు రూ.1.5 లక్షలు, కుమార్తెకురూ. 2.5 లక్షలు (మొత్తం రూ.4 లక్షలు) చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో షమీ ఆర్థిక స్థితి, విలాసవంతమైన జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తం చాలా తక్కువని భరణం పెంచాలని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News