Duleep Trophy: ఇషాన్ కిషన్ కెప్టెన్సీ మెరుపులు.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ఈస్ట్ జోన్
ఈస్ట్ జోన్
Duleep Trophy: దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ అదరగొట్టింది. సెంట్రల్ జోన్‌తో జరిగిన హోరాహోరీ తొలి సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి, ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత రెండు జట్లూ తొలి ఇన్నింగ్స్‌లో సమానంగా 266 పరుగులకు ఆలౌటయ్యాయి. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్‌ను ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు, మహ్మద్ షమి మూడు వికెట్లతో దెబ్బకొట్టడంతో ఆ జట్టు 158 పరుగులకే కుప్పకూలింది. అమన్ మోఖడే 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం 159 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్... ఆరంభంలోనే కొద్దిగా తడబడినప్పటికీ విజయతీరాలకు చేరింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 40 పరుగులు, కెప్టెన్ ఇషాన్ కిషన్ 39 పరుగులతో రాణించి జట్టును ఆదుకున్నారు. అభిమన్యు ఈశ్వరన్, కుమార్ కుశాగ్ర కూడా కీలక పరుగులు జోడించారు.
చివరిలో అనుభవజ్ఞడైన పేసర్ మహ్మద్ షమి అద్భుతమైన ఫోర్‌తో విన్నింగ్ షాట్ కొట్టి జట్టును గెలిపించాడు. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరులో నార్త్ జోన్ లేదా సౌత్ జోన్ జట్లలో విజేతగా నిలిచే జట్టుతో ఈస్ట్ జోన్ తలపడనుంది.