Jadeja Sets New Record: జడేజా సరికొత్త రికార్డు: అనిల్ కుంబ్లే, అశ్విన్ సరసన !

అనిల్ కుంబ్లే, అశ్విన్ సరసన !

Update: 2025-11-25 06:24 GMT

Jadeja Sets New Record: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఉదయం సెషన్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా, టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై 50 వికెట్ల క్లబ్‌లో చేరారు. దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా జడేజా నిలిచారు. ఈ జాబితాలో ఇప్పటికే దిగ్గజాలు ఉన్నారు:

అనిల్ కుంబ్లే (84 వికెట్లు – ఆల్ టైమ్ రికార్డు)

జవగళ్ శ్రీనాథ్

హర్భజన్ సింగ్

రవిచంద్రన్ అశ్విన్

రవీంద్ర జడేజా

జడేజాకు ఇది దక్షిణాఫ్రికాపై ఆడుతున్న 11వ టెస్ట్ మ్యాచ్. 19 ఇన్నింగ్స్‌లలో ఆయన ఈ 50 వికెట్ల ఘనతను సాధించారు. భారత్ తరఫున దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్ల రికార్డు (84 వికెట్లు) ఇప్పటికీ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే తన 18 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో దక్షిణాఫ్రికాతో 21 టెస్ట్‌లు ఆడి ఈ ఘనత సాధించారు.

జడేజా ప్రస్తుతం భారత్‌లో దక్షిణాఫ్రికాపై ఆడిన 9 టెస్టులలో 44 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో జడేజా మరో మూడు వికెట్లు తీయగలిగితే, భారత గడ్డపై దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టిస్తారు. ఈ రికార్డు ప్రస్తుతం రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ (46 వికెట్లు, 7 టెస్ట్‌లు) పేరిట ఉంది. కాగా, భారత బౌలర్లే కాక, ఐదుగురు దక్షిణాఫ్రికా బౌలర్లు కూడా భారత్‌పై 50కి పైగా టెస్ట్ వికెట్లు తీశారు.

Tags:    

Similar News