Japan Open: జపాన్ ఓపెన్ .. లక్ష్యసేన్ ఔట్
లక్ష్యసేన్ ఔట్;
Japan Open: జపాన్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో ఇండియా షట్లర్ల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ 18వ ర్యాంకర్ లక్ష్యసేన్ 19–21, 11–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడాడు. విమెన్స్ సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ 21–13, 11–21, 12–21తో రెండో సీడ్ వాంగ్ జి యి (చైనా) చేతిలో పోరాడి ఓడింది. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 22–24, 14–21తో ఐదోసీడ్ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో కంగుతిన్నారు. ఈ విజయంతో చైనా ప్లేయర్లు సాత్విక్ జంటపై ముఖాముఖి రికార్డులో 7–2 ఆధిక్యంలో నిలిచారు. 44 నిమిషాల మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ నెమ్మదిగా ఆడినా తొలి గేమ్‌లో 18–14 లీడ్‌ను సాధించారు. కానీ అదే జోరును చివరి వరకు కొనసాగించలేకపోయారు.