Ashwin Comments: కర్మ ఎవ్వర్నీ వదిలిపెట్టదు: అశ్విన్
ఎవ్వర్నీ వదిలిపెట్టదు;
Ashwin Comments: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భాగంగా, భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ 'కర్మ' గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గతంలో రిషభ్ పంత్ గాయంపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అశ్విన్ ఈ మాటలు మాట్లాడాడు.
అసలు విషయం ఏంటంటే?
మాంచెస్టర్ టెస్టులో రిషభ్ పంత్‌కు భుజం గాయమైంది. ఆ సమయంలో స్టోక్స్ మాట్లాడుతూ, గాయపడిన ఆటగాడికి ప్రత్యామ్నాయం ఉండాలన్న గౌతమ్ గంభీర్ సూచనను హాస్యాస్పదం అంటూ కొట్టిపారేశాడు.అయితే చివరి టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్‌కు గాయమైనప్పటికీ, జట్టు అవసరాల కోసం అతడు బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఈ సందర్భాన్ని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రస్తావిస్తూ కర్మ గురించి మాట్లాడాడు.
అశ్విన్ వ్యాఖ్యలు
అశ్విన్ మాట్లాడుతూ, కర్మ ఎవరినీ వదిలిపెట్టదు తక్షణమే ప్రభావాన్ని చూపుతుంది అని అన్నాడు. ఒక తమిళ సామెతను ఉదాహరణగా చూపిస్తూ, మనం ఏమి విత్తుతామో, అదే కోస్తాం అని అన్నాడు. స్టోక్స్ క్రికెట్ నైపుణ్యాలను తాను అభిమానినని, కానీ అతడి ఆలోచనా విధానాన్ని మాత్రం అంగీకరించలేనని స్పష్టం చేశాడు. ఒక విషయంపై మాట్లాడే ముందు ఆలోచించాలని స్టోక్స్‌కు పరోక్షంగా చురక అంటించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి, క్రికెట్ వర్గాల్లోనూ దీనిపై చర్చ నడుస్తోంది.