World Record in T20 Cricket: అదిరిపోయే షాట్లు.. మైదానంలో పరుగుల వర్షం! కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరన్ పొలార్డ్ మరోసారి ప్రపంచ క్రికెట్‌ను తన వైపు చూసేలా చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించని అరుదైన ఘనతను సొంతం చేసుకుంటూ.. ప్రపంచ నంబర్ వన్ రికార్డును తిరిగి తన ఖాతాలో వేసుకున్నాడు.

టారూబా వేదికగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగిన పొలార్డ్.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 212 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నైట్ రైడర్స్ కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్.. కేవలం 26 బంతుల్లోనే 5 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో చెలరేగి 65 పరుగులు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 250గా నమోదైంది! ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ పేరు మీద ఉన్న T20 అత్యధిక పరుగుల రికార్డును పొలార్డ్ బ్రేక్ చేశాడు. కొద్ది రోజుల క్రితం 'ది హండ్రెడ్' టోర్నమెంట్‌లో బట్లర్ ఈ రికార్డ్‌ను తన పేరు మీదకు మార్చుకోగా.. ఇప్పుడు CPLలో మెరుపు అర్ధశతకంతో పొలార్డ్ మళ్లీ ఆ సిహాసనాన్ని అధిష్టించాడు.

ప్రస్తుతం 39 ఏళ్ల వయసులోనూ పొలార్డ్ తన బ్యాటింగ్‌తో కుర్రాళ్లకు సైతం పోటీ ఇస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 749 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్, మొత్తం 14,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో బాదిన 5 సిక్సర్లతో కలిపి T20 కెరీర్‌లో అతని మొత్తం సిక్సర్ల సంఖ్య 1,010కి చేరింది. క్రిస్ గేల్ తర్వాత టీ20ల్లో వెయ్యికి పైగా సిక్సర్లు బాదిన ఏకైక వీరుడిగా పొలార్డ్ రికార్డ్ సృష్టించాడు. త్వరలోనే టీ20 చరిత్రలో 15 వేల పరుగుల మైలురాయిని అందుకోబోతున్న తొలి ఆటగాడిగా నిలిచేందుకు పొలార్డ్ కేవలం 79 దూరంలో మాత్రమే ఉన్నాడు.వయసుతో సంబంధం లేకుండా పొలార్డ్ బాదుడు చూస్తుంటే.. క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం ఇప్పుడే అసలు సిసలు మజా ఇస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు

Tags: