Trending News

Kieron Pollard: కోహ్లీని వెనక్కి నెట్టిన విధ్వంసకర ఆటగాడు

వెనక్కి నెట్టిన విధ్వంసకర ఆటగాడు

Update: 2025-06-16 06:27 GMT

Kieron Pollard:  వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పోలార్డ్ టీ20ల్లో మరో రికార్డ్ సృష్టించాడు. టీ20 క్రికెట్ లో ఇండియన్ స్టార్ క్రికెటర్ పరుగుల రన్ మిషన్ విరాట్ కోహ్లీ రికార్డ్ ను బ్రేక్ చేసి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ టీ20 లీగ్ లో భాగంగా పొలార్డ్ ఈ ఘనతను అందుకున్నాడు.

మేజర్ లీగ్ క్రికెట్ లో శనివారం (జూన్ 14) ముంబై ఇండియన్స్ న్యూయార్క్, టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కాలిఫోర్నియాలో జరిగిన ఈ మ్యాచ్ లో ఎంఐ న్యూయార్క్ తరపున ఆడుతున్న పొలార్డ్ 16 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పొలార్డ్ కోహ్లీ పరుగులను అధిగమించాడు. విరాట్ టీ20 ఫార్మాట్ లో 397 ఇన్నింగ్స్ ల్లో 13,543 పరుగులు చేశాడు. మరోవైపు పొలార్డ్ 618 ఇన్నింగ్స్ ల్లో 13,569 పరుగులతో కోహ్లీ పరుగుల రికార్డును వెనక్కి నెట్టాడు. ఈ లిస్ట్ లో వెస్టిండీస్ సిక్సులు వీరుడు క్రిస్ గేల్ (14,562) అగ్ర స్థానంలో ఉన్నాడు. అలెక్స్ హేల్స్ (13,704), షోయబ్ మాలిక్ (13,571) వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. 

Tags:    

Similar News