KL Rahul Lashes Out at Umpire: అంపైర్‌పై కేఎల్ రాహుల్ ఫైర్.. సైలెంట్‌గా ఉండాలా అంటూ..
సైలెంట్‌గా ఉండాలా అంటూ..;
KL Rahul Lashes Out at Umpire: భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈసారి టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, జో రూట్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో జో రూట్ వరుసగా బౌండరీలు కొట్టాడు. జో రూట్ దెబ్బకు సహనం కోల్పోయిన ప్రసిద్ధ్ కృష్ణ, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ను తిట్టాడు. దీంతో రూట్, అతడితో వాగ్వాదానికి దిగాడు. ఇది గమనించిన కెఎల్ రాహుల్ ముందుకు వచ్చాడు.
అలాగే జో రూట్ వాదిస్తుండగా.. అంపైర్ కుమార్ ధర్మసేన అతడిని కామ్ అవ్వాలని కోరాడు. కేఎల్ రాహుల్‌ను సైతం ఊరుకోవాలని సూచించాడు. దీంతో నిశ్శబ్దంగా ఉండాల..బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లాలా? ఏం మాట్లాడొద్దా అంటూ అంపైర్ రాహుల్ ఫైర్ అయ్యారు. కెఎల్ రాహుల్ కోపగించుకోవడానికి ప్రధాన కారణం అంపైర్ భారత ఆటగాళ్లను సైలెంట్ ఉండాలని ఆదేశించడమే. జో రూట్ గొడవ ప్రారంభించినప్పటికీ.. కుమార్ ధర్మసేన కెఎల్ రాహుల్‌తో మాటల యుద్ధాన్ని ఆపమని చెప్పాడు. కాగా రాహుల్ కు నెటిజన్లు మద్ధతుగా నిలుస్తున్నారు.
లండన్‌లోని ఓవల్‌లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. అటు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 247 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా రెండవ ఇన్నింగ్స్ ఆడుతోంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి, భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.