Team India Clinches Victory in the First ODI: చెలరేగిన కోహ్లీ ..తొలి వన్డేలో టీమిండియా విక్టరీ

తొలి వన్డేలో టీమిండియా విక్టరీ

Update: 2026-01-12 08:56 GMT

Team India Clinches Victory in the First ODI: వడోదరలోని కోతంబి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్, న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 300/8 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (84) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఓపెనర్లు డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62) శుభారంభం ఇచ్చారు.

భారీ ఛేజింగ్‌‌‌‌లో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ (26) తొమ్మిదో ఓవర్‌‌‌‌లోనే వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్‌‌‌‌ గిల్‌‌‌‌తో కలిసి విరాట్‌‌‌‌ అద్భుతంగా ఇన్నింగ్స్‌‌‌‌ను నిర్మించాడు.భారత్ 49 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి గెలిచింది.కోహ్లీ కేవలం 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దురదృష్టవశాత్తు కేవలం 7 పరుగుల తేడాతో తన శతకాన్ని (100) మిస్ చేసుకున్నారు. కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (71 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీకి ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. బౌలింగ్‌లో 2 వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచారు.ఈ సిరీస్‌లో రెండో వన్డే జనవరి 14, బుధవారం నాడు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరగనుంది.

చివరలో ఒత్తిడి నెలకొన్న సమయంలో కేఎల్ రాహుల్ (29 నాటౌట్) వరుసగా 4, 4, 6 బాది మ్యాచ్‌ను ముగించారు. అతనికి హర్షిత్ రాణా (29) చక్కని సహకారం అందించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేసిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను అధిగమించి ప్రపంచంలోనే రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా (సచిన్ టెండూల్కర్ తర్వాత) నిలిచారు.

Tags:    

Similar News