Cricket: కుల్దీప్ యాదవ్ కు కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా?
కుల్దీప్ యాదవ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?;
Cricket: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి ప్రియురాలు వంశికతో నిన్న జూన్ 4న లక్నోలో నిశ్చితార్థం చేసుకున్నాడు. క్రికెట్ మైదానంలో తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను భయపెడుతున్న కుల్దీప్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త ఇన్నింగ్స్లోకి అడుగుపెట్టాడు లక్నోలోని ప్రతిష్టాత్మక సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగిన నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, కొంతమంది క్రికెట్ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేడుకకు రింకు సింగ్ కూడా హాజరయ్యారు. కుల్దీప్ కాబోయే భార్య వంశిక LICలో పనిచేస్తుంది. కుల్దీప్ లాగే కాన్పూర్ కు చెందిన వంశిక తన సరళమైన వ్యక్తిత్వంతో అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు కుటుంబాల సమ్మతి, ఆమోదంతో, ఈ సంబంధం బలంగా మారింది. కుల్దీప్, వంశిక వివాహం జూన్ 29న జరగాల్సి ఉంది. అయితే, ఇంగ్లాండ్ పర్యటన కారణంగా వీరి వివాహం వాయిదా పడింది. అయితే, ఈ ఏడాది చివరి నాటికి ఈ జంట వివాహం చేసుకోవడం ఖాయమని వర్గాలు చెబుతున్నాయి.
2025 IPL సీజన్లో, ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన ఈ ఎడమచేతి వాటం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 14 మ్యాచ్ల్లో 15 వికెట్లతో ఆకట్టుకున్నాడు, 7.07 ఎకానమీ రేటును కొనసాగించాడు. జూన్ 20 నుండి ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో కుల్దీప్ యాదవ్ భారత జట్టులో ఒకడు.