Lawrence Bishnoi gang Warning: సల్మాన్ తో సినిమాలు తీసినా..నటించినా చంపేస్తాం..

నటించినా చంపేస్తాం..;

Update: 2025-08-08 11:27 GMT

Lawrence Bishnoi gang Warning: సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే ఎవరినైనా చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది . కెనడాలో కపిల్ శర్మకు చెందిన కేఫ్ పై కాల్పులు జరిగాయి. అయితే దీనికి తామే బాధ్యులమని బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి ప్రకటించాడు. కపిల్ శర్మ తన నెట్‌ఫ్లిక్స్ షో కోసం సల్మాన్ ఖాన్‌ను ఆహ్వానించడం నచ్చలేదని, అందుకే ఈ కాల్పులు జరిపామని చెప్పాడు.

సల్మాన్ ఖాన్‌తో పనిచేసే ఏ దర్శకుడు, నిర్మాత లేదా నటులైనా సరే వారిని తాము క్షమించమని గుండెలపై కాల్చి చంపడానికి కూడా వెనుకాడమని హ్యారీ బాక్సర్ ఆడియో క్లిప్‌లో హెచ్చరించారు.

1998లో జరిగిన కృష్ణజింక వేట కేసు. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణజింకను పవిత్రంగా భావిస్తుంది. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, సల్మాన్ ఖాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాడు.ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు చాలా సార్లు ప్రయత్నించింది. ఏప్రిల్ 2025లో ముంబైలోని సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరపడం, అలాగే ఆయన స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్య వంటి సంఘటనలు ఈ వివాదంలో భాగంగానే జరిగాయి. ఈ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతను కూడా పెంచింది ప్రభుత్వం.

ప్రస్తుతానికి సల్మాన్ ఖాన్‌కు Y+ కేటగిరీ భద్రత ఉంది. ఇది దేశంలోనే అత్యధిక స్థాయి భద్రతలలో ఒకటి. ఈ భద్రతలో భాగంగా సల్మాన్ ఖాన్ చుట్టూ 11 మంది సాయుధ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్లినా సాయుధ సిబ్బందితో కూడిన ఒక ఎస్కార్ట్ వాహనం వెంట ఉంటుంది. సల్మాన్ ప్రయాణించే వాహనాలు బుల్లెట్ ప్రూఫ్ అయి ఉంటాయి. అలాగే ఆయన ఇంటి బాల్కనీకి కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేశారు. ముంబైలోని ఆయన నివాసమైన గ్యాలక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Tags:    

Similar News