Major Changes in Cricket: క్రికెట్లో కీలక మార్పులు.. 24 జట్లతో టీ20 వరల్డ్ కప్.?

24 జట్లతో టీ20 వరల్డ్ కప్.?;

Update: 2025-07-17 06:33 GMT

Major Changes in Cricket: ఇంటర్నేషనల్ క్రికెట్ లో కీలక మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా టీ20లో మార్పులు చేసేందుకు ఐసీసీ ప్రయత్నాలు చేస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో ప్రస్తుతం 20 జట్లు పాల్గొంటున్నాయి. అయితే, భవిష్యత్తులో ఈ సంఖ్యను 24 జట్లకు పెంచే ప్రతిపాదన ఐసీసీ పరిశీలిస్తోంది. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఐసీసీ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. కొత్తగా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాలకు ప్రోత్సాహం అందించడానికి ఈ ఆలోచన చేస్తున్నారు.

ఈ ప్రతిపాదన ఇంకా తుది దశకు రాలేదు. అయితే, ఇది అమలైతే 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత జరగబోయే టోర్నమెంట్లలో 24 జట్లు పాల్గొనే అవకాశం ఉంది. 24 జట్లతో టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహిస్తే అది ప్రస్తుతం ఉన్న ఫార్మాట్ కంటే భిన్నంగా ఉంటుంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. అయితే గ్రూప్ స్టేజ్, సూపర్ 8, నాకౌట్ దశలు ఉండే అవకాశం ఉంది. FIFA వరల్డ్ కప్‌ తరహాలో గ్రూప్‌లను విభజించి ప్రతి గ్రూప్ నుండి కొన్ని జట్లను నాకౌట్ దశకు పంపే అవకాశం ఉందని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఐసీసీ నెక్స్ట్ మీటింగ్స్ లలో ఈ విషయంపై మరింత క్లారిటీ రానుంది.

Tags:    

Similar News