RCB Head Coach: RCB హెడ్ కోచ్‌గా మలోలన్ రంగరాజన్
హెడ్ కోచ్‌గా మలోలన్ రంగరాజన్
RCB Head Coach: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌కు సిద్ధమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళా జట్టు తమ కోచింగ్ విభాగంలో కీలక మార్పు చేసింది. జట్టు సహాయక కోచ్‌గా ఉన్న మలోలన్ రంగరాజన్ను కొత్త హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గత సీజన్లలో RCBకి హెడ్ కోచ్‌గా పనిచేసిన ల్యూక్ విలియమ్స్, వచ్చే WPL సీజన్ తేదీలు ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (BBL) షెడ్యూల్‌తో క్లాష్ అవుతుండటంతో, తన అడిలైడ్ స్ట్రైకర్స్ (BBL) బాధ్యతల కారణంగా WPL నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో, RCB మేనేజ్‌మెంట్ జట్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన రంగరాజన్‌కు హెడ్ కోచ్‌గా ప్రమోషన్ ఇచ్చింది. తమిళనాడుకు చెందిన మాజీ ఆఫ్-స్పిన్నర్ అయిన మలోలన్ రంగరాజన్, WPL ప్రారంభమైన 2023 సీజన్ నుంచీ RCB మహిళా జట్టుకు వివిధ సామర్థ్యాలలో సేవలు అందిస్తున్నారు. 2024లో RCB WPL టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు కూడా అతను అసిస్టెంట్ కోచ్‌గా, స్కౌటింగ్ హెడ్‌గా కీలక భూమిక పోషించారు. తన అనుభవం మరియు జట్టుపై పూర్తి అవగాహన ఉండటం వల్ల, జట్టు నిలకడను కొనసాగించడానికి ఈ నియామకం సరైనదని RCB మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రంగరాజన్‌తో పాటు, RCB తమ కోచింగ్ బృందంలో మరో కీలక మార్పు చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన మాజీ పేసర్, 2017 ODI ప్రపంచ కప్ విజేత అన్యా ష్రబ్సోల్ను కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అన్యాకు WPLలో ఇదే మొదటి కోచింగ్ బాధ్యత. కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన మలోలన్ రంగరాజన్ ముందున్న తక్షణ కర్తవ్యం, నవంబర్ 5 గడువుకు ముందే జట్టు రిటెన్షన్ జాబితాను ఖరారు చేయడం. WPL 2026 మినీ వేలం ఈ నెల చివర్లో (నవంబర్ 26న) ఢిల్లీలో జరగనుంది.