Manav Suthar: గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన బౌలింగ్‌తో కంగారు పెట్టి, లంక బ్యాటర్లను చిత్తు చేయడంతో భారత్ 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

సుతార్ సునామీ.. కుప్పకూలిన లంక

రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక విజయలక్ష్యం 372 పరుగులు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయిన శ్రీలంక, చివరి రోజున ఎలాగైనా పోరాడాలని భావించింది. అయితే, మానవ్ సుతార్ బౌలింగ్ ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. సుతార్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశారు. ముఖ్యంగా తన చివరి 10 బంతుల్లో 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పారు.

పోరాడిన సోనల్ దినూష..

శ్రీలంక తరపున సోనల్ దినూష (84 పరుగులు) అత్యంత బాధ్యతాయుతంగా ఆడి, పోరాటపటిమను ప్రదర్శించారు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన ఆయన, రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించినప్పటికీ, మిగిలిన బ్యాటర్ల నుంచి తగిన సహకారం లభించలేదు. నిరోషన్ డిక్వెల్లా (10) వికెట్ కీలక సమయంలో పడటం లంక విజయ అవకాశాలను దెబ్బతీసింది. యశస్వి జైస్వాల్ వేసిన స్లెడ్జింగ్ కూడా డిక్వెల్లా డిస్మిసల్‌లో పరోక్షంగా ప్రభావం చూపింది.

Tags: