Wimbledon Prize Money: భారీగా పెరిగిన వింబుల్డన్ ప్రైజ్ మనీ.. ఎన్ని కోట్లంటే.?

ప్రైజ్ మనీ.. ఎన్ని కోట్లంటే.?;

Update: 2025-06-13 05:32 GMT
Wimbledon Prize Money: భారీగా పెరిగిన వింబుల్డన్ ప్రైజ్ మనీ.. ఎన్ని కోట్లంటే.?
  • whatsapp icon

Wimbledon Prize Money: వింబుల్డన్ ప్రైజ్ మనీని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ భారీగా పెంచింది. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీని 73 మిలియన్ డాలర్లు (రూ. 624 కోట్లు)గా నిర్ణయించింది. గతేడాది కంటే ఈసారి 6.8 మిలియన్ డాల ర్లను అధికంగా కేటాయించారు. సింగిల్స్ విన్నర్ కు రూ. 34 కోట్లు ఇవ్వనున్నారు. సరిగ్గా పదేళ్ల కిందట వింబుల్డన్లో నెగ్గిన విజేతకు ఇచ్చిన దాని కంటే ఇది డబుల్. 'పదేళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆటలో చాలా మార్పులు వచ్చాయి. ఈ ఏడాది నుంచి ఫ్రై జ్మనీని 7 శాతం పెంచామని చెప్పేందుకు గర్వ పడుతున్నాం. మేం ఆటగాళ్లతో కలిసి పని చేస్తాం. ఈ ఏడాది విజేతలు అందుకునే చెక్ గతం కంటే 11.1 శాతం పెరుగుదల కనిపిస్తుంది. గ్రాండ్ స్లామ్

లాభాల్లో ఎక్కువ వాటా కావాలని ప్లేయర్లు చేస్తున్న డిమాండ్కు ఇది వర్తిస్తుంది' అని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చైర్మన్ డెబోరా జెవాన్స్ వెల్లడించాడు. ఈ నెల 30న మొదలయ్యే వింబుల్డన్ జులై 13 వరకు జరుగుతుం ది. ఈ పురాతన గ్రాండ్ స్లామ్లో తొలిసారి లైన్ జడ్జి లను ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ తో భర్తీ చేయనున్నారు.

Tags:    

Similar News