Mohammed Shami : కూతురి పుట్టిన రోజు..షమీ ఎమోషనల్
షమీ ఎమోషనల్;
Mohammed Shami: ఇండియన్ బౌలర్ మహ్మద్ షమీ తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. జూలై 17, 2025న ఐరా తన 10వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా మహ్మద్ షమీ తన కూతురికి సోషల్ మీడియా ద్వారా భావోద్వేగపూరిత విషెష్ తెలియజేశాడు, ఆమెతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. షమీ తన కూతురిని చాలా మిస్ అవుతున్నానని అన్నాడు.
క్రికెటర్ మహ్మద్ షమీకి ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఐరా షమీ. ఐరా షమీ, మహ్మద్ షమీ, అతని మాజీ భార్య హసిన్ జహాన్ల కుమార్తె. ఆమె 2015లో జన్మించింది. ప్రస్తుతం, ఐరా తన తల్లి హసిన్ జహాన్ వద్దే నివసిస్తోంది, షమీకి, హసిన్ జహాన్‌కు మధ్య విడాకుల కేసు నడుస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం షమీ తన కూతురు ఐరా పోషణ కోసం నెలవారీ భరణం చెల్లిస్తున్నాడు.
2023 వన్డే ప్రపంచకప్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడం వల్ల షమీ కొంతకాలం క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతను ఫిట్‌నెస్ సమస్యల నుంచి పూర్తిగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా లాంగ్ స్పెల్స్ బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాలేదని సమాచారం.