More Disappointment for Mohammed Shami: మహ్మద్ షమికి మళ్లీ నిరాశే.. ఫామ్‌లో ఉన్న పట్టించుకోని సెలక్టర్లు
ఫామ్‌లో ఉన్న పట్టించుకోని సెలక్టర్లు
More Disappointment for Mohammed Shami: గాయం నుంచి కోలుకున్నప్పటికీ..దక్షిణాఫ్రికాతో నవంబర్ 14న మొదలయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు షమిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. 35 ఏళ్ల షమి రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున రెండు మ్యాచ్‌లలో ఏకంగా 15 వికెట్లు తీసి తన ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నప్పటికీ.. అతడికి చోటు దక్కలేదు. ఇది షమికి వరుసగా నాలుగో టెస్టు సిరీస్‌లో ఎదురైన నిరాశ.
రిషబ్ పంత్ గ్రాండ్ రీ-ఎంట్రీ
గాయం నుంచి పూర్తిగా కోలుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. పంత్ ఇటీవల దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆడి తన ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను నిరూపించుకున్నాడు. జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా పంత్ బాధ్యతలు చేపట్టనున్నాడు. పంత్ రాకతో గతంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జట్టులో ఉన్న నారాయణణ్ జగదీశన్‌పై వేటు పడింది.
ఇతర మార్పులు
ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడ్డ పేసర్ ఆకాశ్ దీప్ కూడా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆకాశ్ దీప్ కోసం ప్రసిద్ధ్ కృష్ణను జట్టు నుంచి తప్పించారు.
వెస్టిండీస్‌తో ఆడిన టెస్టు జట్టులో పెద్దగా ఇతర మార్పులేవీ లేవు.
రీస్ వేదికలు, భారత్-ఏ జట్టు
టెస్ట్ షెడ్యూల్:
తొలి టెస్ట్: నవంబర్ 14 నుంచి కోల్‌కతాలో..
రెండో టెస్ట్: నవంబర్ 22 నుంచి గువాహటిలో..
భారత్-ఏ జట్టు: దక్షిణాఫ్రికా-ఎతో మూడు అనధికార వన్డేలు ఆడే భారత్-ఎ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు యువ బ్యాటర్ తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.