Trending News

Netherlands: వన్డే క్రికెట్ లో నెదర్లాండ్ రికార్డ్..

నెదర్లాండ్ రికార్డ్..

Update: 2025-06-13 07:46 GMT

Netherlands: వన్డే క్రికెట్ లో నెదర్లాండ్ రికార్డ్ సృష్టించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. స్కాట్లాండ్ పై 370 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి సంచలనం సృష్టించింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ లో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 369 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కాట్లాండ్ స్టార్ ఓపెనర్ మున్సీ ఒక్కడే 191 పరుగులు చేసి జట్టు మొత్తం చేసిన స్కోర్ లో సగానికి పైగా పరుగులు చేశాడు.

కెప్టెన్ మాథ్యూ క్రాస్ (59) హాఫ్ సెంచరీతో రాణించగా.. మైఖేల్ లీస్క్ (28) చివర్లో మెరుపులు మెరిపించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో మైఖేల్ లెవిట్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 49.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసి గెలిచింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో డచ్ ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ చివరి వరకు క్రీజ్ లో ఉండి అజేయ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. 130 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 158 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓడౌడ్ కు తేజ నిడమానూరు (51), నోహ్ క్రోస్ (50) హాఫ్ సెంచరీలతో చక్కని సహకారం అందించారు. ఓవరాల్ గా ఇది వన్డే క్రికెట్ లో నాలుగో అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. 

Tags:    

Similar News