Rohit Sharma: కొత్త ఫిట్‌నెస్ టెస్ట్: బ్రాంకో పరీక్షకు రోహిత్ శర్మ..

బ్రాంకో పరీక్షకు రోహిత్ శర్మ..;

Update: 2025-08-30 11:58 GMT

Rohit Sharma: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ నెల 13న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి వెళ్లనున్నారు. అక్కడ అతనికి కొత్తగా ప్రవేశపెట్టిన బ్రాంకో ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఐపీఎల్ మ్యాచ్ తర్వాత రోహిత్ ఏ మ్యాచ్ ఆడకపోవడం, టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో చాలా కాలంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం ముందుగానే ఫిట్‌నెస్ పరీక్షకు హాజరు కావడం గమనార్హం.

గతంలో భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించడానికి యోయో టెస్టును నిర్వహించిన బీసీసీఐ, ఇప్పుడు దానికి బదులుగా బ్రాంకో పరీక్షను తీసుకొచ్చింది. ఈ కొత్త పరీక్ష యోయో టెస్టు కంటే చాలా కఠినమైనదని నిపుణులు చెబుతున్నారు.

ఊపిరితిత్తులు పాడైపోతాయి' - ఏబీ డివిలియర్స్:

బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త పరీక్షపై దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ పరీక్ష అంత మంచిది కాదని ఆయన అన్నారు. ‘‘ఆ పరీక్ష గురించి తొలిసారి విన్నప్పుడు అది ఎలా ఉండబోతోందో నాకు అర్థమైంది. అంతకంటే అర్థరహితమైన విషయం ఇంకొకటి ఉండదు’’ అని ఏబీ అన్నారు. ‘‘ప్రిటోరియా యూనివర్సిటీలో ఆ పరీక్షలో పాల్గొన్న రోజు నాకు గుర్తుంది. పెద్దగా ఆక్సిజన్ లేని ఎత్తయిన ప్రదేశంలో పరిగెడుతుంటే ఊపిరితిత్తులు పాడైపోతాయని అనిపించింది’’ అని ఆయన తన అనుభవాన్ని వివరించారు. రోహిత్ శర్మ ఈ కఠినమైన పరీక్షలో ఎలా రాణిస్తాడో చూడాలి.

Tags:    

Similar News