Nikhat Zareen: గోల్డ్ మెడల్ కు అడుగుదూరంలో నిఖత్ జరీన్
అడుగుదూరంలో నిఖత్ జరీన్;
Nikhat Zareen: తెలంగాణ తెలుగు తేజం నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్‌కు ఒక్క పంచ్ దూరంలో నిలిచింది. ఎలైట్ విమెన్స్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో వరల్డ్ చాంపియన్స్ వెయిట్ కేటగిరీల్లో ఫైనల్ చేరుకుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిన్న జరిగిన 51 కేజీల కేటగిరీ క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో కల్పన పై విజయం సాధించింది. ఫైనల్లో రైల్వేస్ బాక్సర్ జ్యోతితో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
తెలంగాణ బాక్సర్లలో 65 కేజీల విభాగంలో యశి శర్మ 3–2తో సరిత రాయ్ (యూపీ)పై గెలుపొందగా.. 60 కేజీల విభాగంలో గోనెళ్ల నిహారిక 5–0తో ప్రియాంక (చత్తీస్‌గఢ్)పై విజయం సాధించింది. నిరూపమ, చిలువేరు అపర్ణలకు క్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. 57 కేజీ కేటగిరీలో అపర్ణ 0–5తో కమల్జీత్ కౌర్ (ఏఐపీ) చేతిలో, 54 కేజీ కేటగిరీలో నిరూపమ 0–5తో తను (ఎస్‌ఎస్‌సీబీ) చేతిలో పరాజయం చవిచూశారు. 48 కేజీల్లో వహి వజీర్ 0–5తో మంజురాణి చేతిలో ఓడింది.