Bhimavaram Bulls Team: భీమవరం బుల్స్ టీమ్ కెప్టెన్‌గా నితీశ్ రెడ్డి
బుల్స్ టీమ్ కెప్టెన్‌గా నితీశ్ రెడ్డి;
Bhimavaram Bulls Team: టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. కానీ నితీష్ తనకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే తీయగా.. బ్యాటింగ్‌లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే నితీశ్ ప్రస్తుతం కెప్టెన్‌గా మారాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025లో ఓ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2022లో ప్రారంభమైన ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో భీమవరం బుల్స్ జట్టుకు నితీష్ రెడ్డి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతోంది. మొత్తం 19 మ్యాచ్‌లు 7 జట్ల మధ్య జరుగుతున్నాయి.
నితీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్టార్ ఆటగాడు.
నితీష్ రెడ్డి ఆంధ్ర క్రికెట్‌కు చెందినవాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే నితీష్‌కు రూ.6 కోట్లు చెల్లిస్తారు. నితీష్ ఐపీఎల్‌లో రాణించిన తర్వాత, భారత టీ20 జట్టుకు డోర్స్ తెరుచుకున్నాయి. ఆ తర్వాత, అతను టెస్ట్ జట్టులోనూ భాగమయ్యాడు. నితీష్ రెడ్డి ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. కానీ పైన చెప్పినట్లుగా, అతను బ్యాటింగ్‌లో బాగా రాణించలేదు. కానీ లార్డ్స్ టెస్ట్‌లో తన బౌలింగ్‌తో అతను ఆకట్టుకోగలిగాడు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025
ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌లో 7 జట్లు పాల్గొంటాయి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో అమరావతి లయన్స్, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్‌షైనర్స్ పాల్గొంటాయి. నితీష్ రెడ్డితో పాటు హనుమ విహారి, కెఎస్ భరత్, షేక్ రషీద్, రికీ భూయ్, అశ్విన్ హెబ్బర్ ఈ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో, కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్ ఒక్కొక్కసారి టైటిల్‌ను గెలుచుకున్నాయి.