One Day World Cup: వన్డే వరల్డ్ కప్: భారత్ పై సౌతాఫ్రికా విజయం
భారత్ పై సౌతాఫ్రికా విజయం
One Day World Cup: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా అక్టోబర్ 9, 2025న విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఇది భారత జట్టుకు ఈ టోర్నీలో మొదటి ఓటమి.
వర్షం వల్ల ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 251 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్, రిచా ఘోష్ (77 బాల్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94) మెరుపులు మెరిపించినా.ఇండియాకు తొలి ఓటమి తప్పలేదు.
252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా జట్టు, చివరి ఓవర్లలో పోరాడి 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
దక్షిణాఫ్రికా విజయంలో ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లర్క్ 61 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని జట్టును గెలిపించింది. ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ వరించింది.
ఈ ప్రపంచ కప్‌లో భారత్‌కు ఇది మొదటి ఓటమి అయినప్పటికీ, అంతకుముందు శ్రీలంక, పాకిస్థాన్‌లపై విజయాలతో పాయింట్ల పట్టికలో మంచి స్థానంలో ఉంది.
ఈ ఓటమి భారత సెమీఫైనల్ ఆశలను కొంత ప్రభావితం చేసినా, టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి.