P. V. Sindhu: ఎట్టకేలకు స్వదేశానికి సింధు

స్వదేశానికి సింధు

Update: 2026-03-04 05:49 GMT

P. V. Sindhu: పశ్చిమాసియాలో యుద్ధం వల్ల దుబాయ్ లో చిక్కుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. ఈ విష యాన్ని సింధు ట్విట్టర్లో వెల్లడించింది. 'సేఫ్ గా బెంగళూరుకు చేరుకున్నా. గడిచిన కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొన్నా. ఎట్టకేలకు ఇంటికి చేరుకోగలిగా. ఈ క్లిష్ట సమయంలో మమ్మల్ని సురక్షితంగా చూసుకోవడం కోసం యూఏఈ అధికారులు, ఎయిర్పోర్టు సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారు లు అందించిన సేవలను మాటల్లో చెప్పలేను. వారందరికీ థాంక్స్. ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. రీసెట్ అయ్యాక నా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచిస్త' అంటూ సింధు పోస్ట్లో చేసింది. కాగా.. ఆల్ ఇంగ్లాండ్ బ్యా డ్మింటన్ చాంపియన్షిప్ కోసం గతవారం ఇంగ్లాండ్ బయల్దేరిన సింధు.. అమెరికా, ఇజ్రా యెల్, ఇరాన్ ఘర్షణల కారణంగా దుబాయ్ ఎయిర్పోర్టులోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News