Pakistan Clinches : పాకిస్తాన్ దే టీ20 సిరీస్..
టీ20 సిరీస్..;
Pakistan Clinches : వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ 2-1 తేడాతో గెలుచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 13 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 189/4 స్కోరు చేసింది. ఓపెనర్లు సైమ్, ఫర్హాన్ తొలి వికెట్‌కు 138 రన్స్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి బలమైన పునాది వేశారు. ఛేజింగ్‌లో వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ, సైమ్ మరో ముగ్గురు తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సాహిబ్జాదా ఫర్హాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆల్-రౌండర్ మహ్మద్ నవాజ్ ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక చేశారు.
ఈ సిరీస్ గెలుపుతో, పాకిస్తాన్ తమ తదుపరి అంతర్జాతీయ మ్యాచ్‌లకు మంచి ప్రదర్శన చేసింది.. త్వరలో ఆసియా కప్‌కు ముందు యూఏఈలో ఆఫ్ఘనిస్తాన్ , యూఏఈ జట్లతో టీ20 ట్రై-సిరీస్‌లో పాల్గొననుంది. ఆ తర్వాత ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది.