Nandini’s Inspiring Comments: అబ్బాయిలతో ప్రాక్టీసే నన్ను పవర్‌ఫుల్ బౌలర్‌ను చేసింది : నందిని

నన్ను పవర్‌ఫుల్ బౌలర్‌ను చేసింది : నందిని

Update: 2026-05-29 09:27 GMT

Nandini’s Inspiring Comments: ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ 'ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత మహిళా క్రికెటర్ నందిని తన ఆట తీరును మార్చుకున్న విధానం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్ చేయడం వల్లే తను బౌలింగ్‌లో వేగాన్ని పెంచడం, వైవిధ్యమైన బంతులు వేయడం నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ.. "మొదట్లో నేను ఒక కోచ్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఆయనే నాకు బౌన్సర్లు ఎలా వేయాలో నేర్పించారు. అయితే లాక్‌డౌన్ తర్వాత నేను నా కోచ్‌ను మార్చాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేదాన్ని. కానీ, నేను వేసే బంతులను అబ్బాయిలు చాలా ఈజీగా గుర్తుపట్టి, భారీ షాట్లు కొట్టేసేవారు. నా బౌలింగ్‌ను వాళ్లు అంత సులువుగా ఆడుతుండటంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు" అని నందిని చెప్పుకొచ్చింది.

అబ్బాయిలు తన బౌలింగ్‌ను ఉతికేస్తుండటంతో.. తన ఆటను మార్చుకోక తప్పలేదని ఆమె పేర్కొంది. "వాళ్లు నన్ను ఈజీగా కొడుతుండటంతో.. నేను మరింత వేగంగా (Faster) బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టాను. దాంతో పాటు బౌలింగ్‌లో రకరకాల వైవిధ్యాలను (Variations) నేర్చుకున్నాను. ఆ దెబ్బలతోనే నా బౌలింగ్ స్టైల్ మారింది" అంటూ నందిని తన ఎదుగుదలను వివరించింది.

Tags:    

Similar News