Chennai Challengers Title: చెన్నై చాలెంజర్స్ విన్నర్ ప్రణేశ్
విన్నర్ ప్రణేశ్;
Chennai Challengers Title: గ్రాండ్ మాస్టర్ ఎం. ప్రణేశ్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2025 టోర్నమెంట్‌లో ఛాలెంజర్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు.ఈ విజయం ద్వారా అతను వచ్చే ఏడాది జరిగే మాస్టర్స్ విభాగంలో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందారు. చివరి రౌండ్‌లో ఓడిపోయినప్పటికీ, అంతకు ముందు మ్యాచ్‌లలో అతని అద్భుతమైన ప్రదర్శన ఈ టైటిల్‌ను సాధించడంలో సహాయపడింది.
ప్రణేశ్ ఈ టోర్నమెంట్‌ను 6.5 పాయింట్లతో ముగించి జీఎం అభిమన్యు పురాణిక్, జీఎం అదిబన్ భాస్కరన్, జీఎం లియోన్ ల్యూక్ మెండోంకా వంటి కీలక ఆటగాళ్ళను అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు. ఈ విజయం అతనికి రూ.7 లక్షల ప్రైజ్ మనీని కూడా తెచ్చిపెట్టింది.
ఈ టోర్నమెంట్‌లో మాస్టర్స్ టైటిల్‌ను జర్మన్ ఆటగాడు విన్సెంట్ కీమర్ గెలుచుకున్నారు. ఇతనికి ప్రైజ్ మనీ రూ.25 లక్షలతో పాటు2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు అర్హత కోసం 24 ఫిడే సర్క్యూట్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. దూకుడు ,వ్యూహాత్మక ఆట శైలికి ప్రసిద్ధి. యువ ఆటగాడు అయినప్పటికీ, తన తెలివైన ఎత్తుగడలతో పెద్ద పెద్ద ఆటగాళ్లను ఓడించగల సత్తా కీమర్ కు ఉంది.