Chris Gayle’s Shocking Comments: పంజాబ్ నన్ను అవమానించింది..గేల్ సంచలన వ్యాఖ్యలు

గేల్ సంచలన వ్యాఖ్యలు

Update: 2025-09-09 09:06 GMT

Chris Gayle’s Shocking Comments: పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్, ఆ జట్టుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తనను సరిగ్గా గౌరవించలేదని అన్నాడు. తాను క్రికెటర్ గా చాలా గొప్పగా భావించేవాడినని, ఎంతో విలువైన ఆటగాడినని, కానీ పంజాబ్ జట్టు తనను గౌరవించడంలో విఫలమైందని అన్నాడు గేల్

కెప్టెన్ కేఎల్ రాహుల్ తనను ఆపడానికి ప్రయత్నించినా అప్పటికే డిసైడ్ అయ్యాయని చెప్పాడు. .అదే సమయంలో జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేను కలిసి తన నిర్ణయం చెప్పానని గేల్ తెలిపాడు. డబ్బు ముఖ్యమేమీ కాదు ఆ సమయంలో మెంటల్ హెల్త్ ముఖ్యమని భావించి వచ్చేశానని చెప్పాడు గేల్.

జట్టులో ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకోవాలో పంజాబ్ యాజమాన్యానికి తెలియదన్నాడు. ఆటగాళ్ల ప్రణాళికలో లోపాలు ఉన్నాయని కూడా ఆయన విమర్శించాడు .ఒక ఆటగాడిని పక్కన పెట్టడానికి సరైన కారణాలు చెప్పలేదని, జట్టులో పారదర్శకత లోపించిందని గేల్ అభిప్రాయపడ్డాడు.

క్రిస్ గేల్ పంజాబ్ కింగ్స్ జట్టు తరపున 2018 నుంచి 2021 వరకు ఆడారు. ఈ కాలంలో ఆయన జట్టుకు ఎన్నో ముఖ్యమైన విజయాలను అందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Tags:    

Similar News