IPL 2025 : ఐపీఎల్లో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్.. కానీ దాని వెనుక ఉన్న అసలు బిజినెస్‌మేన్ ఎవరు?

దాని వెనుక ఉన్న అసలు బిజినెస్‌మేన్ ఎవరు?;

Update: 2025-06-04 06:06 GMT

IPL 2025 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. ఈ సంగతి పక్కన పెడితే క్రికెట్ అభిమానులు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే, ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడింది. ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ రోజు మనం పంజాబ్ కింగ్స్ యజమానుల గురించి వివరంగా తెలుసుకుందాం. పంజాబ్ కింగ్స్ జట్టుకు నలుగురు యజమానులు ఉన్నారు. వీరిలో మీడియా ముందు ఎక్కువగా కనిపించేది ప్రీతి జింటా, నెస్ వాడియా మాత్రమే. కానీ, పంజాబ్ కింగ్స్‌లో అత్యధిక వాటా ఉన్నది మాత్రం మోహిత్ బర్మన్ అనే వ్యక్తికే. అసలు ఈ మోహిత్ బర్మన్ ఎవరో వివరంగా తెలుసుకుందాం.

పంజాబ్ కింగ్స్‌లో ఎవరికి ఎంత వాటా ఉంది?

పంజాబ్ కింగ్స్ జట్టులో మోహిత్ బర్మన్‌కు అత్యధిక వాటా ఉంది. ఏకంగా 48శాతం వాటాతో ఆయనే అతిపెద్ద షేర్‌హోల్డర్. ఇక ప్రీతి జింటా, నెస్ వాడియాలకు చెరో 23శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. మిగిలిన వాటా కరణ్ పాల్ దగ్గర ఉంది. ఇలా చూస్తే, పంజాబ్ కింగ్స్‌లో అత్యధిక వాటా మోహిత్ బర్మన్‌దే. కానీ ఆయన పెద్దగా బయటికి కనిపించరు, లైమ్‌లైట్‌కు చాలా దూరంగా ఉంటారు.

అసలు ఈ మోహిత్ బర్మన్ ఎవరు?

మోహిత్ బర్మన్ మన దేశంలో చాలా పెద్ద బిజినెస్‌మేన్. ఆయన ప్రముఖ 'డాబర్ ఇండియా' కంపెనీకి ఛైర్‌పర్సన్. ఆయన వ్యాపారం మన దేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా విస్తరించి ఉంది. మోహిత్ అమెరికాలోని 'రిచ్‌మండ్ అమెరికన్ యూనివర్సిటీ'లో చదువుకున్నారు. డాబర్ కాకుండా, 'అవివా లైఫ్ ఇన్సూరెన్స్' సంస్థకు కూడా ఆయనే యజమాని. మోహిత్ బర్మన్ కుటుంబం మన దేశంలోని టాప్-20 సంపన్న కుటుంబాల్లో ఒకటి. ఆయన మొత్తం ఆస్తి దాదాపు 77 వేల కోట్ల రూపాయలు. మోహిత్ బర్మన్ ఒక బిజినెస్‌మేన్. ఆయన కోల్‌కతాలో పుట్టారు.

పంజాబ్ కింగ్స్ భాగస్వాముల మధ్య గొడవ?

పంజాబ్ కింగ్స్‌లో అత్యధిక వాటా ఉన్న మోహిత్ బర్మన్, తన వాటాలో కొంత భాగాన్ని ఇంకొకరికి అమ్మాలని అనుకుంటున్నారు. దీన్ని ఆపడం కోసమే ప్రీతి జింటా కోర్టుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే, మోహిత్ బర్మన్ మాత్రం తన వాటాను అమ్మే ఆలోచన లేదని ఒక ప్రకటనలో చెప్పారు. అయినా, బర్మన్ తన 11.5 శాతం వాటాను ఎవరో తెలియని వారికి అమ్మాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మోహిత్ బర్మన్ ఈ జట్టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో కూడా ఒకరు.Punjab Kings, Mohit Burman, Preity Zinta, Ness Wadia, IPL 2025, Dabur India

Tags:    

Similar News