Punjab Kings: గూగుల్ సెర్చ్ లో పంజాబ్ కింగ్స్ రికార్డ్
పంజాబ్ కింగ్స్ రికార్డ్
By : PolitEnt Media
Update: 2025-12-06 05:11 GMT
Punjab Kings: పంజాబ్ కింగ్స్ జట్టు అరుదైన రికార్డ్ సృష్టించింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేయబడిన (Most Searched) స్పోర్ట్స్ టీమ్‌ల జాబితాలో పంజాబ్ కింగ్స్ జట్టుకు 4వ స్థానం దక్కింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లలో కెల్లా అత్యధిక ర్యాంకు సాధించిన జట్టు పంజాబ్ కింగ్స్ రికార్డ్ సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB),ముంబై ఇండియన్స్ వంటి జట్ల కంటే కూడా ఎక్కువ సెర్చ్‌లను పొందింది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసింది, ఇది సెర్చ్ పెరగడానికి ప్రధాన కారణం.
టాప్ 4 స్పోర్ట్స్ టీమ్స్
పారిస్ సెయింట్-జర్మైన్ FC (ఫుట్‌బాల్)
S.L. బెన్ఫికా (ఫుట్‌బాల్)
టొరంటో బ్లూ జేస్ (బేస్‌బాల్)
పంజాబ్ కింగ్స్ (క్రికెట్)