Quinton de Kock : క్వింటన్ డి కాక్ కీలక నిర్ణయం
డి కాక్ కీలక నిర్ణయం
Quinton de Kock : దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డి కాక్ వన్డే క్రికెట్ నుంచి తాను తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పాకిస్థాన్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్లలో ఆయన పేరును చేర్చారు. దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్‌తో జరిగిన చర్చల తర్వాత డి కాక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశం తరఫున ఆడాలన్న అతని కోరిక ఇంకా బలంగా ఉందని కాన్రాడ్ తెలిపారు. డి కాక్ తన పునరాగమనాన్ని 2026 టీ20 ప్రపంచ కప్, అలాగే 2027లో స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత డి కాక్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆ టోర్నీలో అతను 594 పరుగులు చేసి అత్యధిక రన్స్ సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. డి కాక్ 2021లోనే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు, అతను వన్డేల్లోకి తిరిగి రావడం జట్టుకు ఒక పెద్ద బూస్ట్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా వన్డేలలో 1000 పరుగులు సాధించిన అత్యంత వేగవంతమైన దక్షిణాఫ్రికా ఆటగాడిగా క్వింటన్ డి కాక్ రికార్డు సృష్టించాడు.2013లో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడు శతకాలు సాధించి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో మూడో స్థానంలో నిలిచాడు (594 పరుగులు), ఆ టోర్నమెంట్‌లో నాలుగు సెంచరీలు సాధించాడు.మూడు ఫార్మాట్లలోనూ దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే, ఆటపై దృష్టి పెట్టడానికి నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ వంటి పలు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో 100కు పైగా మ్యాచ్‌లు ఆడి, రెండు సార్లు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకున్న జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు.