Rajat Patidar: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు డబుల్ సెలబ్రేషన్ టైమ్! మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే మన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్, ఇప్పుడు తన జీవితంలో అత్యంత అందమైన ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అవును, రజత్ పాటీదార్ తండ్రి అయ్యారు! ఆయన భార్య మగబిడ్డకు జన్మనిచ్చారు.

ఈ విషయాన్ని రజత్ సోషల్ మీడియాలో షేర్ చేయగానే, ఆర్సీబీ ఫ్యాన్స్ అప్పుడే అతన్ని 'జూనియర్ కెప్టెన్' అని పిలవడం మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ నుంచి మొదలుకొని టీమ్ మేట్స్ అందరూ కొత్త తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ 2026 సీజన్‌లో ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన రజత్, అటు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే, ఇప్పుడు తండ్రిగా కొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ చిన్నారి రాకతో రజత్ పాటీదార్ బ్యాట్ మరింత బలంగా జులిపించి, ఈసారి ఆర్సీబీకి కప్పు అందిస్తారని కోరుకుందాం.

Tags: