Ranji Trophy : మళ్లీ రెండు విడతల్లో రంజీ ట్రోఫీ.. ఆగస్టు నుంచే కొత్త సీజన్

ఆగస్టు నుంచే కొత్త సీజన్

Update: 2026-05-21 07:58 GMT

Ranji Trophy : భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! దేశవాళీ క్రికెట్ సమరానికి నగారా మోగింది. 2026-27 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది ఏకంగా వెయ్యికి పైగా మ్యాచ్‌లతో క్రికెట్ పండుగ సాగనుంది.

సీజన్ ప్రారంభం - దులీప్ ట్రోఫీ

కొత్త సీజన్‌కు ఆగస్టు 23న దులీప్ ట్రోఫీతో అట్టహాసంగా తెరలేవనుంది. జోనల్ పద్ధతిలో జరిగే ఈ మ్యాచ్‌లన్నీ బెంగళూరులోని బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' వేదికగా సెప్టెంబర్ 10 వరకు జరుగుతాయి. ఆ తర్వాత, అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్ వేదికగా.. రంజీ ఛాంపియన్ జమ్మూ కాశ్మీర్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక ఇరానీ కప్ మ్యాచ్ జరగనుంది.

రంజీ ట్రోఫీ - రెండు విడతల్లో..

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రంజీ ట్రోఫీని ఈసారి కూడా రెండు విడతల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అక్టోబర్ 11 నుంచి మొదటి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. రెండో విడత మ్యాచ్‌లు 2027 జనవరి 17 నుంచి మార్చి 3 వరకు జరుగుతాయి. ఆటగాళ్లపై పనిభారం తగ్గించేందుకు ఈ విరామం ఎంతో కీలకం కానుంది.

ముస్తాక్ అలీ & విజయ్ హజారే ట్రోఫీలు

మరోవైపు, ఐపీఎల్ వేలానికి ముందే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని నిర్వహించనున్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 6 వరకు జరిగే ఈ టోర్నీ.. యువ ఆటగాళ్లకు తమ టాలెంట్ నిరూపించుకుని ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడటానికి ఒక సువర్ణ అవకాశం. ఆ వెంటనే, డిసెంబర్ 14 నుంచి వన్డే ఫార్మాట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభమవుతుంది.మొత్తంగా మెన్స్, విమెన్స్, వివిధ వయోపరిమితి విభాగాల్లో కలిపి ఈ సీజన్‌లో ఏకంగా 1,788 మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించబోతోంది. మరి ఈ మెగా సీజన్‌లో ఏ కొత్త స్టార్ పుట్టుకొస్తాడో చూడాలి!

Tags:    

Similar News