Rishabh Pant: మళ్లీ అదే తప్పు చేసిన పంత్.. 10 మీటర్ల దూరంలో బ్యాట్..

10 మీటర్ల దూరంలో బ్యాట్..;

Update: 2025-07-05 18:08 GMT

Rishabh Pant: భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించి భారీ ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన సమయంలో కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్ త్వరగానే ఔట్ అయ్యారు. రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ రెండు వికెట్లు పడిన తర్వాత వచ్చిన శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ దూకుడుగా ఆడారు. అదే సమయంలో రిషబ్ పంత్ సిక్స్ కొట్టే ప్రయత్నంలో తన బ్యాట్‌ను వదిలేశాడు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రిషబ్ పంత్ కు పెద్ద షాట్లు కొట్టేటప్పుడు తన బ్యాట్ ను వదిలే అలవాటు ఉంది. ఈ తప్పును తరచుగా చేస్తూనే ఉంటాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఇది చాలాసార్లు జరిగింది. ఇప్పుడు రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నిజానికి టోంగ్ బౌలింగ్‌లో పంత్ పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ కొట్టలేకపోయాడు. బంతి వికెట్ కీపర్ చేతికి అందగానే.. పంత్ బ్యాట్ గాల్లోకి ఎగిరి 10 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పడిపోయింది. ఇది చూసి ప్రేక్షకులు, ఆటగాళ్ళు నవ్వులు చిందిచారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News