Cristiano Ronaldo: రొనాల్డో రిటైర్మెంట్ రూమర్స్.. వరల్డ్ కప్ వేళ పోర్చుగల్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!

పోర్చుగల్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!

Update: 2026-07-03 14:26 GMT

Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాడా? అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. రొనాల్డో సోదరి చేసిన ఒక పోస్ట్.. ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర సంచలనంగా మారింది. వరల్డ్ కప్ ముగిసేలోపే రొనాల్డో తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడంటూ ఆమె చేసిన పోస్ట్.. అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన కీలక మ్యాచ్‌కు ముందే ఈ పోస్ట్ రావడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

కానీ, మైదానంలోకి దిగితే రొనాల్డో స్టయిలే వేరు! ఒత్తిడిని చిత్తు చేస్తూ క్రొయేషియాపై పోర్చుగల్ అద్భుత విజయం సాధించి, ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో తన మార్క్ గోల్‌తో మెరిశాడు. ప్రపంచకప్‌లలో రొనాల్డోకు ఇది 15వ గోల్. దీనితో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన 4వ ఆటగాడిగా రొనాల్డో తన రికార్డును మరింత సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం లియోనెల్ మెస్సి 19 గోల్స్‌తో, ఎంబాపె 18 గోల్స్‌తో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత తన రిటైర్‌మెంట్‌పై వస్తున్న ప్రచారానికి రొనాల్డో చెక్ పెట్టాడు. తానేం తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశాడు."నేనెప్పుడూ తొందరపడి నిర్ణయాలు తీసుకోను. ఏదైనా సరే ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాతే ఆలోచిస్తా. క్రొయేషియా ఆటగాడు లూకా మోడ్రిచ్‌తో కలిసి నేను ఎన్నో ఏళ్లుగా ఆడాను. మా ఇద్దరి వయసు దాదాపు ఒకటే. అతడొక దిగ్గజ ఆటగాడు.. ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఆడుతున్నాడు. అతడిని ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది." అని రొనాల్డో చెప్పుకొచ్చాడు.

ఈ విజయంతో ఊపుమీదున్న పోర్చుగల్.. ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్‌తో తలపడనుంది. మరి, ప్రత్యర్థులకు అడ్డుగోడగా నిలుస్తున్న స్పెయిన్ గోల్ కీపర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, రొనాల్డో తన జట్టును క్వార్టర్స్ వైపు నడిపిస్తాడో లేదో చూడాలి!

Tags:    

Similar News