Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు రూ.కోటి నజరానా

రూ.కోటి నజరానా

Update: 2026-05-16 03:40 GMT

Ishan Kishan: టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ కు కు బిహార్‌ సీఎం సమ్రాట్‌ చౌధరీ రూ.కోటి నజరానా అందించారు. టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్‌ లో టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ నగదు బహుమతిని అందజేశారు. సీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇషాన్‌కు రూ. కోటి నజరానాను అందజేశారు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా.. బిహార్‌ ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌధరీ ఇషాన్ కిషన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. బిహార్ గడ్డ గర్వించదగ్గ ప్రదర్శన చేశావంటూ సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.

టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమ్ ఇండియాను విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ బుల్లోడు ఇషాన్ కిషన్‌పై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.వరల్డ్ కప్ ఫైనల్ లాంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌లో.. ఒత్తిడిని చిత్తు చేస్తూ ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 54 పరుగులు పిండుకొని భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ టోర్నీ ఆద్యంతం అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్.. 9 మ్యాచుల్లో ఏకంగా 317 పరుగులు సాధించి, అత్యధిక పరుగులు చేసిన టాప్-4 బ్యాటర్ల జాబితాలో చేరాడు.

అయితే ఈ విజయం వెనుక ఒక తీరని వేదన కూడా ఉంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోజే తన కజిన్ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఆ బాధను గుండెల్లో దాచుకొని దేశం కోసం మైదానంలోకి దిగాడు ఇషాన్. గెలిచిన తర్వాత కన్నీళ్లతో ఈ విజయాన్ని తన సోదరికి అంకితమిస్తున్నట్లు ప్రకటించి అందరినీ కదిలించాడు.

Tags:    

Similar News