Sachin Tendulkar: సిరాజ్ పై సచిన్ ప్రశంసలు
సచిన్ ప్రశంసలు;
Sachin Tendulkar: ఇంగ్లాండ్‌పై రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ 70 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. తొలిసారి ఇంగ్లాండ్‌లో సిరాజ్ ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో సిరాజ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ బౌలింగ్‌లో నేనొక అతిపెద్ద మార్పును గమనించానన్నాడు. సరైన ప్రాంతంలో బంతులేయడం, కచ్చితత్వంతో కూడిన బౌలింగ్ ఆకట్టుకుంది. అందుకు ప్రతిఫలమే ఆరు వికెట్ల ప్రదర్శన. ఆకాశ్ దీప్ 4 వికెట్లు తీసి మంచి సహకారం అందించాడని చెప్పాడు. . బ్రూక్ - స్మిత్ మద్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. ఒత్తిడిలోనూ వారు దూకుడుగా ఆడారు. భారత తొలి ఇన్నింగ్స్ సచిన్ పోస్టు చేశాడు.
జేమీ స్మిత్ (207 బాల్స్‌లో 21 ఫోర్లు, 4 సిక్సర్లతో 184 నాటౌట్), హ్యారీ బ్రూక్ (234 బాల్స్‌లో 17 ఫోర్లు, 1 సిక్స్‌తో 158) భారీ సెంచరీలతో విధ్వంసం సృష్టించి 407 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫస్ట్ ఇన్సింగ్స్‌లో ఇండియా 587 పరుగుల భారీ స్కోర్ చేయగా ప్రస్తుతం ఇండియా 244 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.