Sarfraz Khan: 2నెలల్లో 17 కిలోల బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్

బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్;

Update: 2025-07-22 09:19 GMT

Sarfraz Khan: భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం 2 నెలల స్వల్ప వ్యవధిలోనే ఆయన ఏకంగా 17 కిలోల బరువు తగ్గించుకుని, స్లిమ్ లుక్‌లోకి మారారు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించినప్పటికీ, అధిక బరువు కారణంగా ఫిట్‌నెస్‌పై తరచు విమర్శలు ఎదుర్కొంటున్న సర్ఫరాజ్, ఈ మార్పుతో తన పట్టుదలను నిరూపించుకున్నారు. తనకి ఎంతో ఇష్టమైన రోటీ, రైస్‌ను పూర్తిగా తినడం మానేశాడు. గత రెండు నెలలుగా ఇంట్లో ఒక్క చపాతీ కానీ, ప్లేట్ రైస్ కానీ తినలేదట. బ్రొకోలీ, కీర దోశ, సలాడ్స్, గ్రీన్ వెజిటేబుల్ సలాడ్‌లను ఎక్కువగా తీసుకుంటున్నాడు. నాన్-వెజ్ పూర్తిగా మానకుండా, చేపలు, గ్రిల్డ్ చికెన్, ఉడకబెట్టిన చికెన్, గుడ్లను తాజా ఆకుకూరలతో తీసుకుంటున్నాడు. బిర్యానీకి బదులుగా అవకాడో తింటున్నాడు. చక్కెర, మైదా వాడి చేసిన వంటకాలను, బేకరీ ఐటెమ్స్, స్వీట్లను అస్సలు తీసుకోవడం లేదు. గ్రీన్ టీ మరియు గ్రీన్ కాఫీలను అలవాటు చేసుకున్నాడు. రోజుకోసారి మొలకెత్తిన విత్తనాలను తీసుకుంటున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ జిమ్‌లో క్రమం తప్పకుండా జిమ్ చేస్తున్నాడు. రోజు గంట పాటు వారానికి ఆరు రోజులు జిమ్‌కు వెళ్లాడు. సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేసినప్పటికీ, తన ఫిట్‌నెస్ కారణంగా భారత జట్టులో స్థానం దక్కించుకోవడానికి ఇబ్బందులు పడ్డాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు ఎంపిక కాకపోవడం అతన్ని మరింత పట్టుదలతో పని చేసేలా చేసిందని తెలుస్తోంది. తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవడం ద్వారా టీమిండియాలోకి తిరిగి రావాలని సర్ఫరాజ్ దృఢ సంకల్పంతో ఉన్నాడు.

Tags:    

Similar News