Team India Heading Toward Defeat: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ..ఓటమి దిశగా టీమిండియా
ఓటమి దిశగా టీమిండియా
Team India Heading Toward Defeat: సౌతాఫ్రికాతో గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం దిశగా ఉంది. ఈ రోజు ఉదయం అంటే ఐదో రోజు ఆట ప్రారంభం అయింది.
దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 27/2 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ప్రస్తుతం టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. ఇంకా 484 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం జడేజా 3, సాయి సుదర్శన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
వెనుకంజకు ప్రధాన కారణాలు
మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 489 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించిన యాన్సెన్, బంతితోనూ అద్భుతంగా రాణించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ కావడానికి అతని 6/48 గణాంకాలే ప్రధాన కారణం.తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం లభించినప్పటికీ, సౌతాఫ్రికా ఫాలో ఆన్ ఇవ్వకుండా మళ్ళీ బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ రెండవ ఇన్నింగ్స్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వికెట్లను కోల్పోవడం, మిగిలిన కీలక బ్యాటర్లు కూడా పెద్దగా నిలదొక్కుకోలేకపోవడం భారత్ ఓటమికి దగ్గర చేసింది.
దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఈ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ఈ టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది, ఈ రెండో టెస్టు గెలిస్తే భారత గడ్డపై చాలా అరుదైన టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేస్తుంది.