Second Test against West Indies: జైశ్వాల్ రనౌట్.. డబుల్ సెంచరీ మిస్

డబుల్ సెంచరీ మిస్

Update: 2025-10-11 05:24 GMT

Second Test against West Indies: వెస్టిండీస్ తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఇక డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న యశస్వి జైశ్వాల్ రనౌట్ అయ్యాడు. ఆట ప్రారంభమైన కాసేపటికే రెండు పరుగులు చేసి 175 వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 3 వికెట్లు కోల్పోయి 356 పరుగుల దగ్గర ఉంది. గిల్ 45, నితీశ్ రెడ్డి 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుత సెంచరీ 175 చేశాడు. ఇది అతనికి 7వ టెస్టు సెంచరీ. అతని ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు ఉన్నాయి.

ఈ టెస్టులో యశస్వీ జైశ్వాల్ రికార్డ్ సృష్టించాడు. 23 ఏళ్ల వయస్సులోనే ఐదుసార్లు 150+ స్కోర్‌లు నమోదు చేశాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (8) తర్వాత ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్నాడు. మొత్తం మీద, 24 ఏళ్ల లోపు అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా సచిన్ టెండూల్కర్ (11), బ్రాడ్‌మన్ (12) గార్ఫీల్డ్ సోబర్స్ (9) తర్వాత జైస్వాల్ (7) వ స్థానంలో ఉన్నాడు. 24 ఏళ్ల లోపు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు (7) సాధించిన భారత ఓపెనర్‌గా, ప్రపంచంలో గ్రేమ్ స్మిత్‌తో (7) సంయుక్తంగా అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్‌గా నిలిచాడు.

Tags:    

Similar News