Second Test Against West Indies: వెస్టిండీస్ తో రెండో టెస్ట్ ..టాస్ మనదే

టాస్ మనదే

Update: 2025-10-10 06:18 GMT

Second Test Against West Indies: వెస్టిండీస్‌తో ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసే సరికి భారత్ 10 పరుగులు చేసింది. జైశ్వాల్ 1,రాహుల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత్ మొదటి టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.భారత జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్కు ఇది మొదటి టాస్ విజయం కావడం విశేషం.రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో టెస్టుల్లో 4,000 పరుగులు, 300 వికెట్ల రికార్డును సాధించే అవకాశం ఉంది.

భారత జట్టు

యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ ( కెప్టెన్ ), ధ్రువ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

వెస్టిండీస్ జట్టు

జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్ (కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్

Tags:    

Similar News