Shane Warne: 18 ఏళ్ల క్రితం డీల్.. RR అమ్మకంతో వారసులకు వందల కోట్ల ఆస్తి

RR అమ్మకంతో వారసులకు వందల కోట్ల ఆస్తి

Update: 2026-03-25 07:53 GMT

Shane Warne: క్రికెట్ మైదానంలో స్పిన్ మాంత్రికుడిగా ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన షాన్ వార్న్.. వ్యాపార రంగంలోనూ అంతకంటే పదునైన వ్యూహాన్ని రచించారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వార్న్, అప్పట్లో ఎవరూ ఊహించని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అది ఇప్పుడు ఆయన వారసుల జీవితాలనే మార్చేసింది!

ఐపీఎల్ తొలి నాలుగు సీజన్లకు కలిపి వార్న్ తీసుకున్న జీతం కేవలం రూ. 9.35 కోట్లు మాత్రమే. కానీ, ఆయన తన రిటైర్మెంట్ డీల్‌లో ఒక తెలివైన కండిషన్ పెట్టారు. తాను ఆడిన ప్రతి సీజన్‌కు గానూ జట్టులో 0.75% వాటా కావాలని కోరారు. అలా నాలుగు ఏళ్లలో కలిపి రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఏకంగా 3% వాటాను తన సొంతం చేసుకున్నారు. అప్పట్లో అది చిన్న విషయమే అనిపించినా, ఇప్పుడు దాని విలువ వింటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే!

కాలం మారింది.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టు విలువ ఏకంగా రూ.15,301 కోట్లకు చేరినట్లు వార్తలు వచ్చాయి. దీంతో షాన్ వార్న్ దగ్గర ఉన్న ఆ 3% వాటా విలువ ఇప్పుడు అక్షరాలా రూ. 460 కోట్లు! కేవలం 9 కోట్ల శాలరీతో మొదలైన ప్రయాణం.. వందల కోట్ల లాభం వైపు మలుపు తిరిగింది.

దురదృష్టవశాత్తూ షాన్ వార్న్ మన మధ్య లేకపోయినా, ఆయన వేసిన ఆనాటి వ్యూహాత్మక అడుగు ఇప్పుడు ఆయన పిల్లలను కోటీశ్వరులను చేసింది. ఒక క్రీడాకారుడు కేవలం ఆటపైనే కాదు, భవిష్యత్తుపై ఎంతటి దూరదృష్టితో ఉండాలో చెప్పడానికి వార్న్ ఉదంతమే ఒక గొప్ప ఉదాహరణ.

Tags:    

Similar News