Shashank Singh: అపుడు నన్ను చెంప దెబ్బ కొట్టాల్సింది
చెంప దెబ్బ కొట్టాల్సింది;
Shashank Singh: ఐపీఎల్ 18లో క్వాలియఫర్ 2లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. పంజాబ్ ఇన్సింగ్స్ 17వ ఓవర్లో శశాంక్ నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌట్ అయ్యాడు. ఇరు జట్లు విజయం కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడుతోన్న వేళ వికెట్ల మధ్య బద్దకంగా పరిగెత్తిన శశాంక్ సింగ్ ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా విసిరిన డైరెక్ట్ త్రోకు రనౌట్ అయ్యాడు. అప్పటికే కీలకమైన బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో ఒత్తిడిలో ఉన్న పంజాబ్.. శశాంక్ సింగ్ రనౌట్‌తో మరింత ఒత్తిడిలోకి వెళ్లింది. శశాంక్ ఔట్ అయినప్పటికీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చివరి వరకు క్రీజులో ఉండి పంజాబ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అయితే మ్యాచ్ అనంతరం శశాంక్‌ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిట్టాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. శశాంక్‌ను శ్రేయస్ అయ్యర్ తిట్టడానికి కారణం శశాంక్ సింగ్ లేజీనెస్. తాజాగా ఈ ఇష్యూపై శశాంక్ సింగ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కీలకమైన మ్యాచులో నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌట్ అయ్యా. దీనికి నన్ను మా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిట్టాడు. కీలకమైన సమయంలో ఇంత నిర్లక్ష్యాన్ని నా నుంచి ఊహించలేదని స్పష్టంగా చెప్పాడు. నేను చేసిన పనికి శ్రేయస్ నన్ను తిట్టడం కరెక్టే. అయ్యర్ నన్ను తిట్టడం కాదు చెంపదెబ్బ కొట్టి ఉండాల్సింది. ఈ ఘటన తర్వాత మా నాన్న కూడా ఫైనల్స్ వరకు నాతో మాట్లాడలేదు. కానీ ఈ ఘటన తర్వాత శ్రేయస్ నన్ను డిన్నర్‌కు తీసుకెళ్లాడు అని శశాంక్ సింగ్ అన్నాడు