Shock for KKR: కేకేఆర్ కు షాక్.. తప్పుకున్న హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్
తప్పుకున్న హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్;
Shock for KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) హెడ్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని కేకేఆర్ అధికారికంగా ధృవీకరించింది. చంద్రకాత్ కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తున్నాడు. రాబోయే సీజన్ నుంచి కేకేఆర్ హెడ్‌కోచ్‌గా కొనసాగడు. 2024లో ఐపీఎల్ ఛాంపియన్‌షిప్‌ను గెలవడంలో బలమైన జట్టును నిర్మించడంలో పండిట్ కీలక పాత్ర పోషించాడు. అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాం అని తెలిపింది.
2024 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో పండిట్ కీలక పాత్ర పోషించారు. అయితే 2025 సీజన్‌లో జట్టు పేలవమైన ప్రదర్శన కనబరిచి ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. దీనికి బాధ్యత వహించిన పండిట్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
2022 ఆగస్టులో బ్రెండన్ మెక్‌కల్లమ్ స్థానంలో చంద్రకాంత్ పండిట్ కేకేఆర్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను గెలిపించిన వెంటనే ఆయనకు ఈ అవకాశం లభించింది. పండిట్ కోచింగ్‌లో కేకే ఆర్ 2024 IPL సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. ఇది పండిట్ కోచింగ్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి. అయితే, ఈ విజయంలో మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా ఎక్కువగా ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు.తనకు కేకేఆర్ లో క్రెడిట్ దక్కకపోవడంతోనే జట్టు నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.