Shreyas Iyer: ఐర్లాండ్ సిరీస్‌కు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. నెట్టింట వైరల్ అవుతున్న ఇన్‌స్టా బయో!
నెట్టింట వైరల్ అవుతున్న ఇన్‌స్టా బయో!
Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఐర్లాండ్‌తో జరగబోయే రెండు టీ20ల సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికై వార్తల్లో నిలిచిన శ్రేయస్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన ఒక చిన్న మార్పుతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ బయోలో.. ‘ఇది నా రెండో పుట్టిన రోజు’ అంటూ ఒక ప్రత్యేకమైన తేదీని మెన్షన్ చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నిజానికి శ్రేయస్ అయ్యర్ పుట్టింది 1994 డిసెంబర్ 6న. కానీ, తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో మాత్రం గతేడాది డిసెంబర్ 25వ తేదీని తన రెండో పుట్టినరోజుగా రాసుకొచ్చాడు. దాంతో.. అసలు గతేడాది క్రిస్మస్ రోజున శ్రేయస్ జీవితంలో ఏం జరిగింది? ఆ తేదీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? అని అభిమానులంతా ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా అసలు కథను బయటపెట్టాడు. గతేడాది, అంటే.. 2025 డిసెంబర్ 25న శ్రేయస్ అయ్యర్ ఒక భయంకరమైన గాయం నుంచి కోలుకుని, మళ్లీ చేతిలోకి బ్యాట్ పట్టాడు. ఒకానొక దశలో ప్రాణాలకే ముప్పు వచ్చే పరిస్థితి నుంచి శ్రేయస్ తృటిలో బయటపడ్డాడని.. అందుకే ఆ రోజు అతడికి కేవలం క్రికెట్ మైదానంలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన రోజు మాత్రమే కాదు, తన జీవితంలోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిన రోజు అని ఆ అభిమాని భావోద్వేగంగా రాసుకొచ్చాడు.
అవును.. ప్రాణాంతక పరిస్థితి నుంచి బయటపడి, తీవ్రమైన శారీరక, మానసిక వేదనను అనుభవించిన శ్రేయస్.. డిసెంబర్ 25 నుంచి తన జీవితాన్ని సరికొత్తగా, అత్యంత క్రమశిక్షణతో ప్రారంభించాడు. ఎంతో కష్టపడి తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు.
గాయాలను, కష్టాలను జయించి.. ఇప్పుడు ఏకంగా ఐర్లాండ్ సిరీస్‌కు కెప్టెన్‌గా జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. శ్రేయస్ చూపించిన ఈ పోరాట పటిమపై నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘నువ్వు నిజమైన ఫైటర్వి అయ్యర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.