Shubman Gill: నా ఫెవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ.? మ్యాచ్ విక్టరీతో గిల్ సెటైర్లు
మ్యాచ్ విక్టరీతో గిల్ సెటైర్లు;
Shubman Gill: ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా 336 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఓ జర్నలిస్ట్‌ను ట్రోల్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ టెస్టుకు ముందు ఓ ఇంగ్లిష్ జర్నలిస్ట్ టీమిండియా రికార్డ్ పై పలు ప్రశ్నలు వేశాడు. అలాగే జస్‌ప్రీత్ బుమ్రా లేకుండా ఎలా నెట్టుకొస్తారంటూ ప్రశ్నించాడు. రెండో టెస్టులో భారత్ గెలిచిన తర్వాత ఆ జర్నలిస్ట్‌ను ట్రోల్ చేసేలా గిల్ సరదా వ్యాఖ్యలు చేశాడు. నాకు ఇష్టమైన జర్నలిస్ట్ ఎక్కడ? కనిపించడం లేదు. అతడిని చూడాలని ఉంది అనడంతో అందరూ నవ్వుకున్నారు.
సెకండ్ టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 150పరుగులకు తోడు ఆకాశ్ దీప్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి పది వికెట్లతో కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో విజృంభించడంతో నిన్న ముగిసిన రెండో టెస్టులో 336 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై అఖండ విజయం అందుకుంది. ఇండియా ఇచ్చిన 608 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 72/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లిష్ టీమ్ 68.1 ఓవర్లలో 271 కే కుప్పకూలి చిత్తుగా ఓడింది. దాంతో ఇండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది.